Tuesday, 3 November 2026

ఆర్టీసీతో పెట్టుకుంటే మసైపోతారు

– ఉద్యమ సమయంలో హావిూలను నెరవేర్చాలి
– కాళేశ్వరం నుంచి చుక్కనీరు కూడా ఎల్లపల్లికి ఎత్తిపోయలేదు
– ప్రాజెక్టుల అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
– కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌5 (జనంసాక్షి):  ఉద్యమ సమయంలో ఆర్టీసీకి ఇచ్చిన హావిూలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన అసెంబ్లీ విూడియా హాల్‌లో మాట్లాడారు.. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే మసైపోతారని హెచ్చరించారు. సమైక్య పాలకులను హెచ్చరించిన కేసీఆర్‌ ఇప్పుడు ఆయన మసికాక తప్పదన్నారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతం కోసం ప్రభుత్వంలో వీలీనం చేశారని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా కార్మికులను సమ్మె వైపు పురికొల్పిందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి నాలుగు నెలలు అవుతుందని, ఒక్క చుక్క నీరుకూడా ఎల్లంపల్లికి ఎత్తి పోయలేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. కడెం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీరు మాత్రమే ఎల్లంపల్లికి చేరిందని, ప్రాజెక్టు ప్రచారంలో ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి, నిర్మాణంలో లేదని విమర్శించారు. మిడ్‌ మానేరులో నీటి నిల్వచేసే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టు ఫలాలు అందలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు రిపోర్ట్‌ ను నివేదించక పోవడం వల్ల జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడలేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానికి ఇచ్చిన 23విజ్ఞప్తిలలో రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు జాతీయ ¬దా కల్పించమని కోరారా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరంకు జాతీయ ¬దా అడగలేదని, రోజుకు రెండు టీఏంసీల నీరుఎత్తిపోసే ఆ నీరు మనకు సరిపొతుందని కానీ రెండు టీఏంసీలకు అదనంగా మరో టీఏంసీ ఎత్తి పోసే విధంగా రీ డిజైన్‌ చేశారని అన్నారు. మరో ఆర్థిక మోసానికి తెరలేపారని విమర్శించారు. అప్పుతెచ్చి అదనపు టీఏంసీని ఎత్తిపోసే నిర్మాణం చేపడుతున్నారన్నారు. టెండర్లు పిలవకుండా రూ.4600కోట్లు నిర్మాణం పనులు చేస్తున్నారని, ఈ అవినీతిని అరికట్టాల్సిన భాధ్యత గవర్నర్‌ పై ఉందని జీవన్‌రెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపిఆర్‌ కేంద్రానికి పంపలేదని రాజ్యసభలో చెప్పిన సమాధానం కాపీని, అదనపు టీఏంసీ నిర్మాణంలో జరుగుతున్న అవినీతి వివరాలను లేఖ ద్వారా గవర్నర్‌ కు తెలియజేస్తున్నారు. టెండర్‌ పక్రియ చేపట్టడం వల్ల ఆలస్యమవుతుందని నామినేషన్‌ ద్వారా 5600కోట్ల రూపాయల పనులు నామినేషన్‌ ద్వారా ఇచ్చారని విమర్శించారు.