డిఎం జి పరమేశ్వరి
వీపనగండ్ల నవంబర్ 08 (జనంసాక్షి) ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సాగించి ఆదరించాలని వనపర్తి డిఎం జి పరమేశ్వరి కోరారు. ప్రజల వద్దకు ఆర్టిసి అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీపనగండ్ల మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన బస్టాండు ప్రాంగణాన్ని డిఎం పరిశీలించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం ప్రజలకు సురక్షితమని డిఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీపనగండ్లకు వచ్చిన డిఎంకు గ్రామ సర్పంచ్ వంగూరు నరసింహారెడ్డి.. సింగిల్ విండో డైరెక్టర్ జెట్టి సూర్యనారాయణలతో పాటు గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం డిఎం గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకోగా… బస్సులు… బస్టాండ్ సమస్యల పైన డి ఎం కు వినతి పత్రాన్ని అందజేశారు. తూముకుంట వరకు ఉదయం సెటిల్ బస్సును పొడగిస్తామని… రద్దయిన సాయంత్రం బస్సును పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా డిఎం చెప్పారు. బస్టాండ్ చుట్టూ షాపింగ్ సెడ్స్.. టాయిలెట్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తామని డి ఎం తెలిపారు.కాగా గ్రామానికి వచ్చిన డిఎం ను గ్రామ సర్పంచ్.. సింగిల్ విండో డైరెక్టర్ లు శాలువాతో సన్మానం చేశారు. డిఎం వెంట అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి. ఆర్టీసీ ఉద్యోగులు జె.వెంకటస్వామి.. శ్రీనివాసచారిలు వెంకటేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంగెం వెంకటయ్య గోపి… కురుమూర్తి చెన్న కృష్ణ వెంకటేష్ గౌడ్ఉషన్న పుల్లయ్య తదితరులున్నారు.