Tuesday, 3 November 2026

ఆర్టీసీలో నష్టాలు…ఒడ్డున పడని ఆర్టీసీ

APSRTC_818844fహైదరాబాద్‌ సిటీ : ఆర్టీసీలో నష్టాలు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు… రెండడుగులు వెనుక్కు పడుతున్నాయి. ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా అవి పాత అప్పులు చెల్లించడానికే సరిపోతున్నాయి. కొత్తబస్సుల రాకతో మార్పులొచ్చి ఆదాయం పెరుగుతుందని అధి కారులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. గ్రేటర్‌ హైద రాబాద్‌ జోన్‌లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. నష్టాలు పెరుగుతుండడంతో అధికారులపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. రెండు నెలల నుంచి డిపోల వారీగా అధికారులు సర్వే నిర్వహించి కొత్తరూట్లను ఎంపిక చేశారు. వాటిని అందుబాటులోకి తీసుకురావా లంటే నగరానికి కొత్త బస్సులు రావాల్సిందేనని చెబు తున్నారు.

ఏటా పెరుగుతున్న నష్టాలు

ఒకప్పుడు లాభాల్లో ఉన్న ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో ఉంది. 2014-15లో నష్టాలు 193 కోట్లకు చేరితే, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 354.68 కోట్లకు చేరాయి. ఒక్క సంవత్సరంలో నష్టం 146.67 కోట్లకు పెరిగింది. నష్టాలు తగ్గించుకునేందుకు రద్దీ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచినా సమయపాలన పాటించకపోవడంతో అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు.
బస్టాండ్ల ఆధునీకరణతో మార్పులు
నష్టాలు తగ్గించుకునేందుకు ప్రధాన బస్టాండ్లతో పాటు నగరంలోని ఎనిమిది ప్రయాణ ప్రాంగణాలపై అధి కారులు దృష్టిసారించారు. ఇప్పటికే ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్లను ఆఽధునీకరిస్తున్న అధికారులు మాల్స్‌ తరహా లో షాప్‌లు ఏర్పాటుచేసి ఆదాయం పెంచుకునే అవకాశా లను పరిశీలిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో 28 డిపోలలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని ఇతర అవసరా లకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మెట్రో రైలుతో బస్టాపులను అను సంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సికింద్రాబాద్‌, కోఠి, పటాన్‌చెరువు, కూకట్‌పల్లి, మెహదీపట్నం, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌ వంటి రద్దీ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు సమయపాలన పరిశీలించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *