కార్మికులకు విధుల్లోకి తీసుకోమని ఎలా చెబుతారు?
ఐఎఎస్‌లతో రాష్టాన్న్రి నడుపుతున్న కెసిఆర్
మండిపడ్డ భట్టి, జీవన్ రెడ్డి
హైదరాబాద్,నవంబర్26(జనం సాక్షి): విధుల్లోకి చేరుతామన్న ఆర్టీసీ కార్మికులను చేర్చుకోమని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చెప్పడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆర్టీసీ సమ్మె పై సీఎం కేసీఆర్ లేదా రవాణా శాఖ మంత్రి మాట్లాడాలి కానీ ఆర్టీసీ ఎండీ మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఐఎఎస్‌లు పరిధి దాటి మాట్లాడుతున్నారన్నారు. కొంతమంది పోలీస్ అధికారులతో,ఐఏఎస్ అధికారులతో కేసీఆర్ రాష్టాన్న్రి నడపాలని చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తప్పుడు ఆలోచనల కోసం ఐఏఎస్‌లను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు పరిధి దాటి వ్యవహరించొద్దని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం విూడియాతో మాట్లాడిన భట్టీ.. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేసీఆర్ తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను నిరోధించకపోతే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని.. కేసీఆర్ దృష్టిలో అసలు రాజ్యాంగమే లేదన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నాడని భట్టి అన్నారు. ఆయనకు రాజ్యాంగం అంటే లెక్కలేదని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకొని సీఎల్పీ విలీనం అయిందని చెప్పారు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యే లు వేర్వేరు తేదిల్లో పార్టీ మారుతున్నామని చెప్పారు. ఇది ఏ విధంగా విలీనం అవుతుందని భట్టి ప్రశ్నించారు. సీఎల్పీ ,టిఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం అయిందని సీఎం.. సభను తప్పుదారి పట్టించారని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమం చేస్తామని, ప్రజా క్షేత్రంలోకి దిగుతామని భట్టి అన్నారు. ఇదిలావుంటే
కేసీఆర్ మొండివైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జఠిలం అయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. డీజిల్ పెంపు తోనే సంవత్సరానికి 720 కోట్ల భారం ఆర్టీసీ పైన పడుతుంది. బస్ పాస్ రాయితీలకు మరో 500 కోట్ల భారం పడుతుంది. ఆ భారాన్నీ ప్రభుత్వం భర్తీ చేయాలి. జిహెచ్‌ఎంసి నుండి 300 కోట్లు ఆర్ధికంగా సపోర్ట్ చేయాలని కేసీఆరే చట్టం చేశారు. ఒక సంవత్సరం అమలు చేసిన తర్వాత ఆయన కొడుకు కేటీఆర్ అదే చట్టాన్ని రద్దు చేశారు. ఈ రాష్టాన్రికి ముఖ్యమంత్రి అయ్య కేసీఆరా.? కొడుకు కేటీఆరా..? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారు. ఆర్టీసీ పైన కేంద్రం కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులను తొలగించే అధికారం కేసీఆర్‌కు లేదు, వాళ్ల అయ్యకు లేదని మండిపడ్డారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేట్ పరం చేస్తే… కాంగ్రెస్ అధికారంలోకి
వచ్చాక రూట్లను తిరిగి జాతీయం చేస్తామన్నారు.
ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తీరు దుర్మార్గం




