హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ ప్రాంతం నుంచి వెళ్తోన్న ఆర్టీసీ బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దింపాడు. ఈ బస్సు ఉప్పల్ నుంచి లింగంపల్లి వెళ్తోండగా ఘటన చోటుచేసుకుంది.




