Wednesday, 4 November 2026

ఆర్టీసీ బస్సు‌ను లారీ ఢీకొనడంతో 20 మందికి గాయాలు

ప.గో,ఆగస్టు 17: భీమడోలు దగ్గర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు‌కు ఎదురుగా వస్తున్నా లారీ ఢీకొనడంతో 20 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు‌ తణుకు నుంచి ద్వారకాతిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *