ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తల్లీ కుమారుడు ఆత్మహత్య
హైదరాబాద్,జూలై25 జులై 25 (జనంసాక్షి ): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేటలోని ఎస్ఆర్ కాలనీలో తల్లి గంజి పద్మ (40), కుమారుడు వంశీ (18) అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. పద్మ భర్త శివ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో ఆమె కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు వంశీ కూడా ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి
తరలించారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన వీరి కుటుంబం కొన్నేళ్లుగా ఎస్ఆర్ కాలనీలో ఉంటోంది.