Tuesday, 3 November 2026

ఆలయపరిరక్షణపై స్పష్టత ఏదీ

రాజకీయ పార్టీలకు సౌందర్యరాజన్‌ ప్రశ్న
హైదరాబాద్‌,నవంబర్‌28(జనంసాక్షి): రాష్ట్రంలోని ఆలయాల పరిరక్షణపై రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆలయాల పరిరక్షణ సమితి కన్వీనర్‌, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీ సౌందర రాజన్‌ కోరారు. ఆలయాలకు రక్షణ కల్పించడంతో పాటు అన్యాక్రాంత భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలన్నీ పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయని.. అయితే.. ఒక్క పార్టీ కూడా ఆలయాల గురించి ప్రస్తావించడం లేదన్నారు. తెలంగాణలోని ఆలయాలు, వాటి పరిరక్షణకు చేపట్టే చర్యలపై ప్రధాన పార్టీలు స్పష్టత ఇవ్వాలన్నారు. ధార్మిక పరిషత్‌ ఏర్పాటు, తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల పరిరక్షణ, సంప్రదాయ అర్చకులు.. వారి కుటుంబాల పరిరక్షణకు చర్యలు చేపట్టడం తదితర అంశాలపై ప్రధాన పార్టీలు స్పష్టత ఇచ్చి తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాలని సౌందరరాజన్‌ కోరారు. ఈ మేరకు తమ విధానాలను ప్రజలకు తెలియచేయాలన్నారు.