నేటి పీఎస్‌ఎల్వీ సీ-43 ప్రయోగానికి కౌంట్‌డౌన్
శ్రీహరికోట,నవంబర్28(జనంసాక్షి): ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్వీ సీ-43 ప్రయోగానికి
ఉదయం 5.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ పక్రియ నిరంతరాయంగా 28 గంటల పాటు కొనసాగనుంది. గురువారం ఉదయం 9.58 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-43 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. మొత్తం 31 ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. మన దేశానికి చెందిన ఊజాఎ/ూ ఉపగ్రహంతో పాటు యూఎస్‌కు చెందిన 23, ఆస్టేల్రియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్, మలేషియా, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. ఊజాఎ/ూ ద్వారా 630 కిలోవిూటర్ల నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను చూసే అవకాశముంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాల అంచనా నీరు, మట్టి ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి సేవలందించనుంది.
మరో ప్రయోగానికి సిద్దమైన ఇస్రో




