*ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బేగరి రాజు నియామకం*

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్హైదరాబాదులో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఏ విధంగా పని చేయాలి దశదిశ భవిష్యత్ కార్యాచరణ పైన అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం  రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బేగరి రాజు ను  ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బేగరి రాజు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఇచ్చినటువంటి బాధ్యతను సమ సమాజ నిర్మాణం కోసం పూలే, అంబేద్కర్ ఆశయాల కోసం పని చేస్తానని ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.విద్యాసాగర్ గారికి ఆలిండియా అంబేద్కర్ యువజన  సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వినయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు బేగరి ప్రభాకర్, మాజీ ప్రధాన కార్యదర్శి తీర్పల్లి ప్రవీణ్, మాజీ  సహాయ కార్యదర్శి పంబల్ల రవీందర్,మచంపల్లి రామస్వామి,సతీష్,రమేష్, పాల్గొన్నారు