*థాయ్ లాండ్ లో యోగ దినోత్సవ వేడుకలు జరుపుకున్న కొత్తకోట ఆరోగ్య వాకింగ్ సభ్యులు,.
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఆరోగ్య క్లబ్ సభ్యులు వారం రోజుల కోసం థాయిలాండ్ పర్యటనకు వెళ్లగా ముగింపు రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా యోగా చేసి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నట్లు కొత్తకోట వాకింగ్ ఆరోగ్య క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్ గౌడ్,చింతలపల్లి రవీందర్ రెడ్డి లు తెలిపారు.వాకింగ్ క్లబ్ సభ్యులు విదేశీ పర్యటన కోసం 7 రోజులపాటు *థాయిలాండ్* లో వివిధ పర్యాటక ప్రదేశాలు పర్యటించి..అక్కడి ప్రాంతం, దీవుల అందాలను తిలకించి ఆనందాన్ని పొందారు.. విదేశీ పర్యటనలో ఉన్న గాని తమ బాధ్యతలు, ఆచరణలను విడిచి పెట్టకుండా సభ్యులు అందరూ యోగ దినోత్సవ ప్రాముక్యతను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉదయం సామూహికంగా *ఆసనాలు* *సూర్యనమస్కారాలు* చేసి ఆనందం తో పాటు ఆరోగ్యాన్ని పొందారు…చివరి రోజు వారు బస చేసిన హోటల్ లో వేకువ జామునే యోగ దినోత్సవాన్ని జరుపుకుని క్లబ్ సభ్యులు తమ ఔన్నత్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని అందించిన భారతదేశ గొప్ప ధనాన్ని ..విదేశాల్లో చాటి చెప్పడం చాలా ఆనందంగా ఉందని సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కారక్రమంలో క్లబ్ నిర్వాహకులు ఉపాధ్యాయుడు శేఖర్ గౌడ్ మరియు సభ్యులు రవీందర్ రెడ్డి, లక్మిరెడ్డి, ప్రసాద్, ఎల్లయ్య, బాలకృష్ణ, నవీన్, రవియాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు