ఆశలు ఆవిరి!
– చివరి దశలో హెచ్-4 వీసా రద్దు ప్రక్రియ
– సంకేతాలిచ్చిన ట్రంప్ ప్రభుత్వం
– ఆందోళనలో భారతీయ ఐటీ నిపుణులు
వాషింగ్టన్, మే25(జనంసాక్షి) : ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. హెచ్-4 వీసాను రద్దు చేసే పక్రియ చివరి దశల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంకేతాలు అందించింది. అమెరికాలో హెచ్ -1బి వీసా విూద పనిచేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే స్పౌస్ వీసా హెచ్-4ను రద్దు చేయాలన్న నిర్ణయం తుదిదశలో ఉందని ట్రంప్ పరిపాలన విభాగం అమెరికా కోర్టుకు తెలియజేసింది. ప్రతిపాదిత నియమం తుది దశంలో ఉందని డిపార్ట్‌మెంట్ అఫ్ ¬మ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ఫెడరల్ కోర్టుకు గురువారం నివేదించింది. ఈ నిర్ణయం తుదిరూపు దాల్చి అమలులోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. హెచ్1బి వీసా విూద అమెరికాలో పనిచేసే వృత్తినిపుణుల జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా కింద అమెరికాలో నివసించడానికి అనుమతి లభిస్తుంది. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో (2015)లో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయటానికి అనుమతించే ఈఏడీ (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్
డాక్యుమెంట్ ) కి చరమగీతం పాడాలని ట్రంప్ సర్కార్ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంలో భాగంగా హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేయటానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలనీ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ఎక్కువుగా పొందుతున్న భారతీయ ఐటీ నిపుణుల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొన్న సంగతి విదితమే.