Monday, 2 November 2026

ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూపు

నిధులులేవంటున్న అధికారులు
హైదరాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : జిల్లాల్లో నాలుగు నెలలుగా కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు కావడంలేదు. వివిధ విభాగాల్లో అర్హులైన పేదలు దరఖాస్తులు చేసుకోవడమే తప్ప అనుమతులు రావడం లేదు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే ప్రభు త్వం నుంచి అనుమతులు లేవు. ఇందుకు ఆర్థిక ఇబ్బందులే కారణమని స్పష్టమవుతోం ది. పింఛన్‌ మొత్తాన్ని గణనీయంగా పెంచడం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో కొత్త వారికి పెన్షన్‌ అందే పరిస్థితి లేకుండా పోయింది.  నిరుపేదలకు ఆసరాగా ఉంటామని ప్రభుత్వం హావిూ ఇచ్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు ప్రభుత్వం ప్రతినెల ఆసరా పేరిట పింఛన్‌ విడుదల చేస్తోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ మొత్తాన్ని 2014 నుంచి గణనీయంగా పెంచుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల హావిూ మేరకు ఆయా వర్గాలకు ఆసరా పింఛన్లను పెంచి అందిస్తోంది. అంతకముందు వృద్దులు, వితంతువులు, తదితరులకు ఇచ్చే పింఛన్‌ మొత్తాన్ని రూ.200 నుంచి ఏకంగా రూ.1000కి పెంచారు. అలాగే వృద్ధుల కు ఇచ్చే రూ.500లను రూ.1500కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేర కు ఆసరా పెన్షన్ల పథకం నిర్విఘ్ఞంగా కొనసాగుతోంది. తెలంగాణ ఆసరా పింఛన్‌ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీతకార్మికులు, ఎయిడ్స్‌ బాధితులు లబ్దిపొందుతున్నారు. ఆసరా పథకానికి ప్రజల్లో మంచి
ఆదరణ లభించడంతో మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేల పింఛన్లు రెట్టింపు చేస్తామని టీఆర్‌ఎస్‌ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ మేరకు వృద్ధులకు సహా ఆయా వర్గాలకు రూ.1000 ఉన్న ఆసరా పింఛన్‌ను రెట్టింపు చేస్తూ రూ.2016గా ప్రకటించింది. అలాగే వికలాంగులకు ఉన్న రూ.1500 పింఛన్‌ను రూ.3వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన పిం ఛన్లు ఏప్రిల్‌ నుంచి ఇవ్వాలని ప్రభుత్వం భా వించినా ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ జూన్‌ నుంచి పంపిణీ చేస్తోంది. ఆసరా పింఛన్‌
పేరుకు తగిన విధంగా చేయూతనిస్తుండ టంతో ప్రజల్లో మంచి స్పందన ఉంది. ప్రభుత్వం సూచించే అన్ని అర్హత లు ఉన్నందున తమకు ఆసరా పింఛన్‌ మంజూరు చేయాలంటూ జిల్లాల్లో  దరఖాస్తులు చేసుకుంటున్నారు.