Wednesday, 4 November 2026

ఆసుపత్రి నుంచి మలాలా డిశ్చార్జ్‌

లండన్‌ : పాకిస్థానీ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్‌ని ఇక్కడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను సుమారు నాలుగునెలల క్రితం నుంచి ఇక్కడికి చికిత్స నిమిత్తం తరలించిన విషయం తెలిసిందే. బ్రిమింగ్‌హాంలోని క్వీస్‌ ఎలిజెబెత్‌ ఆసుపత్రిలో అయిదు గంటలపాటు శస్త్రచికిత్స చేసిన అనంతరం మలాలా మెల్లగా కోలుకుంది. ఆసుపత్రికి సమీపంలోనే ఆమె తల్లిదండ్రులు, సోదరుల కోసం ప్రత్యేకంగా నివాస వసతిని కల్పించారు. ఇప్పుడిక డిశ్చార్జ్‌ అనంతరం ఆమె వైద్యుల సిఫారసు మేరకు ఔట్‌పేషెంట్‌గా ఆసుపత్రికి వచ్చివెళ్లాలి ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి, బాలికల విద్యకోసం  పోరాడుతున్నందుకు కక్షగట్టిన తాలిబన్లు గత అక్టోబరు 9వ తేదీన స్వాత్‌ లోయల్‌ ఆమె జరిపిన కాల్పులో మలాలా తీవ్రంగా గాయపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *