ఆస్కార్ అవార్డులు ఇవీ…
లాస్‌ఎంజెల్స్ : ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో హాలీవుడ్ డాల్బీ థియేటర్‌లో ఈ వేడుగ అట్టహాసంగా ప్రారంభమైంది. 87వ సారి జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా ఎడ్డీ రెడ్ మెన్, ఉత్తమ నటిగా జూలియన్ మూరే, ఉత్తమ దర్శకత్వ అవార్డును అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు అందుకున్నారు. దిగ్రాండ్ బుడాపెస్ట్ ¬టల్, బర్డ్ మేన్ చిత్రాలు నాలుగు విభాగాల్లో విప్లాష్ చిత్రం మూడు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కించుకున్నాయి. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు, నటీ నటుల ఈ వేడుకలకు హాజరయ్యారు.
87వ ఆస్కార్ అవార్డులు ఇవీ…
ఉత్తమ చిత్రం: బర్డ్‌మేన్
ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్ మైనే (ది థీయరీ ఆఫ్ ఎవరీ థింగ్)
ఉత్తమ నటి: జూలియన్ మూరే (స్టిల్ అలైస్)
ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు (బర్డ్‌మేన్)
ఉత్తమ సహాయ నటుడు: జేకే సైమన్స్ (విప్లాష్)
ఉత్తమ సహాయ నటి: పాట్రికియా ఆర్క్విటే (బాయ్ హుడ్)
ఉత్తమ విదేశీ చిత్రం: ఐదా
ఉత్తమ రచనా- అడాప్టడ్ స్క్రీన్ ప్లే: గ్రహం మూరే, ది ఇమిటేషన్ గేమ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: అలెజాండ్రో జీ ఇనారిట్టు, నికోలాస్ గియాకోబోన్, అలెగ్జాండర్ డైన్లారిస్, ఆర్మాండో బో, (బర్డ్‌మేన్)
ఉత్తమ సినిమాటోఫోగ్రపీ: ఇమ్మాన్యుయెల్ లూబెజ్కీ(బర్డ్‌మేన్)
ఉత్తమ సంగీతం-ఒరిజినల్ స్కోర్: అలెగ్జాండ్రె డెస్ప్లాట్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్: ఫ్రాన్సెస్ హన్నాన్ అండ్ మార్క్ కొలియర్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ ¬టల్)
ఉత్తమ కాస్ట్యుమ్ డిజైన్: మిలేనా కెనానిరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ ¬టల్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: జాన్ స్టీఫెన్స్ లోన్నీ లిన్ (గ్లోరీ, సెల్మా)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లీ, ఇయాన్ హంటర్ అండ్ స్కాట్ ఫిషర్ (ఇంటర్ స్టెల్లర్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్: సిటిజన్ ఫోర్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: టామ్ క్రాస్ విప్లాష్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్-లైవ్ యాక్షన్: ది ఫోన్ కాల్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్-యానిమేటెడ్: ఫియస్ట్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: బిగ్ హీరో 6