Tuesday, 3 November 2026

ఆస్తులు ముఖ్యం కాదు..చెల్లింపులు చేయండి

 

అగ్రిగోల్డ్‌ బాధితుల ఆందోళన

విజయవాడ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ బాధితులు చేపట్టిన ధర్మాగ్రహదీక్ష కొనసాగుతోంది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ భారీగా ఉందని విపక్ష నేతలు చెప్పడంలో వాస్తవాలు ఎలా ఉన్నా తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు. 30 గంటల నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులు దీక్ష చేపట్టారు. 13 జిల్లాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వివిధ పార్టీల నేతలు వారికి మద్దతుగా నిలిచారు. బాధితులకు సత్వరం న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు.