Thursday, 5 November 2026

ఆహారంలో విషం కలిపి హత్య : వరవరరావు

భద్రాచలం, జనంసాక్షి: ఛత్తీస్‌గడ్‌లో నిన్న జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. ఇక్కడ ఆస్పత్రిలోని మృతదేహాలను ఆయన సందర్శించారు. బంధువులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవర్టు ఆపరేషన్‌ ద్వారా ఆహారంలో విషం కలిపి పోలీసులు మావోయిస్టులను హత్య చేశారని చెప్పారు. మృతదేహాలను భద్రాచలంలో పోస్టుమార్టం నిర్వహించకుండా ఛత్తీస్‌గఢ్‌ తరలించడం అమానుషం అన్నారు. ఆ మృతదేహలకు ఇక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయమై తాను హోం మంత్రి సబితతో మాట్లాడినట్లు చెప్పారు. అయినా ఫలితంలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *