– చంద్రబాబు మాటలే తన చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి
– బాబు పాత ట్వీట్లను సీ్నన్‌షాట్ తీసి పోస్టుచేసిన కేటీఆర్
హైదరాబాద్, నవంబర్1(జనంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ తో కలసి పనిచేయాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు ఆయన గతంలో బాబు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడి మాటలను ప్రతిధ్వనింపచేయడమే తప్ప మరేవిూ కామెంట్ చేయబోను అని అంటూ గతంలో చంద్రబాబు చేసిన కొన్ని ట్వీట్ల సీ్నన్ షాట్లను కేటీఆర్ పోస్టు చేశారు. గతంలో చంద్రబాబు ‘అవినీతి కాంగ్రెస్ నుంచి దేశానికి స్వాతంత్యం తేవడమే నా లక్ష్యం, అందుకోసం ఏమైనా చేస్తాను అని చెప్పిన ట్వీట్లను జత చేశారు. వీటితో పాటు ‘రాహుల్ ను ప్రధానిగా చేయాలన్న సోనియా గాంధీ, వ్యక్తిగత ఎజెండాతో దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని, ‘ఏపీ కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ కాళ్లపై పడిపోయారు, ఇప్పుడు 1983 రిపీట్ అవుతుందని గతంలో చంద్రబాబు టీట్లు చేశారు. కాంగ్రెస్
తుడిచిపెట్టుకు పోతుంది అని, ‘అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకించారు. ఎన్డీయేకు ఓటిసిన వారందరికీ ధన్యవాదాలు అని బాబు ట్వీట్లను పోస్టు చేశారు. ఆ ట్వీట్లను ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పోస్టు చేశారు. దీంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఆ ట్వీట్లు నావి కావు.. చంద్రబాబువే!




