ఎల్బీనగర్ (జనంసాక్షి) ఆ మహాశివుడి ఆశిష్యులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ అన్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ వైదేహి నగర్ లోని శివాలయంలో జరిగిన శివలింగ రూపేణ దీపోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ భక్తులతో కలిసి దీపారాధన చేశారు.అంతకుముందు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ మహాశివుడిని కొరుకున్నానన్నారు.




