గురుగాప్ : ఇటీవల నక్సలైట్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ సీనియర్ నేత వీసీ శుక్లా ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా కోలుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అయినా ఆయన ఇంకా ప్రమాద పరిస్థితి నుంచి బయటపడినట్టు కాదని శుక్లాకు వైద్యం చేస్తున్న వైద్యులు పేర్కొన్నారు. ‘‘శుక్లా అరోగ్యపరిస్థితి స్థిరంగా ఉంది. మెరుగుపడుతున్నట్లుగా కొన్ని సూచనలు గమనించాం. అయినప్పటికీ అయన అరోగ్యం అందోళనకరంగానే ఉంది. ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడలేదు. శుక్లా మెలకువగానూ , స్సృహలోనూ ఉన్నారు’’ అని మేదాంత ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఏకే దూబే గురువారం విలేకరులకు వెల్లడిరచారు.




