Tuesday, 3 November 2026

ఎర్రచందనం పట్టుకున్న డీఎస్పీ

చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బాక్రాపేట కనుమ రహదారిలో గంగమ్మగుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. మినీ లారీలో బెల్లం బస్తాల మధ్య దుంగలను తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎస్కే బాబు, సీఐ నాగభూషణం తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని చెప్పారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టినట్లు వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *