వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం బైపాస్ రోడ్డుపై ఈ ఉదయం అగివున్న లారీని అటో ఢీకొంది. ఈ ప్రమాదంలో అటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. మృతున్ని గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం పెదపాలెం గ్రామానికి చెందిన జంపని నరేంద్ర (26)గా గుర్తించారు. క్షతగాత్రులను చీరాల అసుపత్రికి తరలించారు.




