Monday, 2 November 2026

‘ఇంకో మగాడు పుట్టలేదు రాజమౌళి మామా’

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజువల్‌ వండర్‌ ‘బాహుబలి 2: ది కన్లూక్యూజన్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జక్కన రాజమౌళి చెక్కిన ఈ అద్భుతాన్ని చూసేందుకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పోటీపడుతున్నారు. ఇప్పటికే జూ.ఎన్టీఆర్‌, నాని, అఖిల్‌ అక్కినేని, నిఖిల్‌ తదితరులు సినిమాను వీక్షించి బాహుబలి టీంకు అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.‘బాహుబలి2.. భారత సినీరంగంలో ఓ అద్భుత క్యాన్వాస్‌. ఈ చిత్రంతో ఒక్క తెలుగు సినిమానే కాదు, భారతీయ చిత్రాలను కూడా ఓ కొత్త స్థాయికి తీసుకెళ్లారు. హ్యాట్సాఫ్‌ రాజమౌళి. ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ నటన అమోఘం’ – జూనియర్‌ ఎన్టీఆర్‌‘నువ్వు మా పక్కన ఉన్నంతవరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా. బాహుబలి ఒక సినిమా కాదు ఇదో పండగ. థాంక్యూ బాహుబలి టీం, మమ్మల్ని గర్వపడేలా చేశారు’ -నాని

‘ఓ మనిషి సృజనాత్మకత, 500 మంది టెక్నీషియన్ల కష్టం. ఆరేళ్ల పట్టుదల.. ఇదంతా కలిస్తే ఓ మిరాకిల్‌. అదే బాహుబలి’ – సాయి ధరమ్‌ తేజ్‌

‘బాహుబలి2 సినిమా చూశా. అంచనాలను మించిన బాహుబలి. రాజమౌళికి శిరస్సు వంచాల్సిందే’ – నిఖిల్‌

‘ఇప్పుడే బాహుబలి 2 చూశాను. నోట మాట రావట్లేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. బాహుబలి టీంకు ఆల్‌ దిబెస్ట్‌ చెప్పనవసరం లేదు’ – అఖిల్‌ అక్కినేని

‘ప్రపంచ వ్యాప్త మేనియా మొదలైంది: బాహుబలి ది కన్లూకూజన్‌’ – కరణ్‌ జోహార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *