కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 28న ఆయా జిల్లా ఎస్పీ, కమిషనర్ల వద్ద ఒరిజినల్ ధ్రువ పత్రాలతో రిపోర్టు చేయాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎంపికైన 7,573 మంది అభ్యర్థులు ఈనెల 28న ఉదయం 11 గంటలకల్లా పోలీస్ యూనిట్ కార్యాలయాల్లో, బెటాలియన్‌కు ఎంపికైన అభ్యర్థులు బెటాలియన్ యూనిట్ కార్యాలయాల్లో హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.




