Tuesday, 3 November 2026

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపిక

చెన్నై: నవంబర్‌ 15 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు భారత జట్టును ఎంపిక చేశారు. ఇందులో సెలక్టర్లు సురేశ్‌రైనాకు ఉద్వాసన పలకగా, యువరాజ్‌సింగ్‌ పునరాగమనం చేశాడు. హర్భజన్‌సింగ్‌, ఇషాంత్‌ శర్మకు జట్టులో చోటు కల్పించారు. రిజర్వు ఓపెనర్లుగా మురళీ విజయ్‌, అజంక్య రహానే అవకాశం దక్కించుకున్నారరు. జట్టులో గౌతమ్‌ గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లి, సచిన్‌ టెండూల్కర్‌, ఛటేశ్వర్‌ పూజారా, యువరాజ్‌ సింగ్‌, రవిచంద్రన్‌ ఆశ్విన్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మురళీ విజయ్‌, అజింక్య రహానే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *