నగరంలో చేపడుతున్న రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేతలపై సోషల్ ఆడిట్‌లో భాగంగా స్థానికుల ధృవీకరణ సంతకాలను తప్పనిసరిగా చేపట్టాలని జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్ సర్కిల్‌లో జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులతో పాటు హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ తదితర పనులను కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. నేడు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఈస్ట్‌జోన్‌లోని ఎల్బీనగర్ సర్కిల్‌లో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. లింగోజిగూడలో రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేతను తనిఖీ చేశారు. గుంతల పూడ్చివేతలో విధిగా సోషల్ ఆడిట్‌ను చేపట్టాలని, పరిసరాల్లోని నివాసితుల సంతకాలను చేపట్టాలను కమిషనర్ ఆదేశించారు. మై జిహెచ్ఎంసి యాప్, కాల్ సెంటర్, డయల్ 100, ఇతర మార్గాల ద్వారా రోడ్ల మరమ్మతులపై అందే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. నగరంలో ప్రతిరోజు వర్షం కురుస్తున్నందున నీటి నల్వలు ఉండకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు మురికి గుంతలు, కాలువల్లో యాంటి లార్వా మందును పిచికారి చేయాలని ఎంటమాలజి సిబ్బందిని ఆదేశించారు. అనంతరం బైరమల్‌గూడలో వెదురుతో ట్రీగార్డ్‌లను అల్లుతున్న ఇంటికి వెళ్లి వాటిని పరిశీలించారు. ఎకో ఫ్రెండ్లీగా ఉన్న ఈ వెదురు ట్రీగార్డ్‌లను అల్లుతున్న ఇద్దరిని సన్మానించారు. ఎల్బీనగర్ సర్కిల్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించే ఇందిరానగర్ స్లమ్‌కు వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని కోరగా ఇందుకు ఇందిరానగర్ వాసులు అంగీకరించారు. సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ మైదానంలో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున నాటిన మొక్కల సంరక్షణకు చేపట్టిన చర్యలను పరిశీలించారు. అనంతరం జీహెచ్ఎంసి ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్, డిప్యూటి కమిషనర్లు పంకజ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ పనులలో సోషల్ ఆడిట్ తప్పనిసరి – కమిషనర్ జనార్దన్‌రెడ్డి




