వచ్చే నెలలో జరగనున్న వినాయక చవితి పండుగలో మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రచురించిన రసాయనాల వినాయకులు వద్దు పర్యావరణ పరిరక్షణే మనకు ముద్దు అనే కర పత్రాన్ని జీహెచ్ఎంసి కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఇతర రసాయనాలు కలిగిన రంగులతో కూడిన విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం వల్ల దాదాపు 7వేల టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, ప్లాస్టిక్ కాగితాలు, పాదరసం, సీసం, రెడ్ఆక్సైడ్ తదితర విష రసాయనాలు కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో హుస్సేన్ సాగర్‌లో జలాలు విషపూరితమయ్యాయని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టు కూడా స్పందించిన దృష్ట్యా ప్రతిఒక్కరూ తక్కువ ఎత్తు గల మట్టి వినాయకులను పూజించాలని కమిషనర్ కోరారు.మట్టి వినాయకులను పూజిద్దాం…పర్యావరణాన్ని పరిరక్షిద్దాం – కమిషనర్
వచ్చే నెలలో జరగనున్న వినాయక చవితి పండుగలో మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రచురించిన రసాయనాల వినాయకులు వద్దు పర్యావరణ పరిరక్షణే మనకు ముద్దు అనే కర పత్రాన్ని జీహెచ్ఎంసి కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ ఇతర రసాయనాలు కలిగిన రంగులతో కూడిన విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం వల్ల దాదాపు 7వేల టన్నుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, ప్లాస్టిక్ కాగితాలు, పాదరసం, సీసం, రెడ్ఆక్సైడ్ తదితర విష రసాయనాలు కలుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో హుస్సేన్ సాగర్‌లో జలాలు విషపూరితమయ్యాయని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టు కూడా స్పందించిన దృష్ట్యా ప్రతిఒక్కరూ తక్కువ ఎత్తు గల మట్టి వినాయకులను పూజించాలని కమిషనర్ కోరారు.



