ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం : మోదీ…. ఇదేలా..?

 

nuzrex5jఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడానికి మోదీ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్వ్యూల వలననే తల్లిదండ్రులు పరుగులు పెట్టి లంచం ఇవ్వజూపుతున్నారని, సిఫార్సు లేఖల కోసం నాయకుల చుట్టూ తిరుగుతున్నారనే ఉద్దేశ్యంతో వాటి తొలగింపు దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. ఆదివారం నిర్వహించిన ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 
కిందిస్థాయి ఉద్యోగాల కు ఇంటర్వ్యూలు అవసరమా? అని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రశ్నించిన ప్రధాని మోదీ.. దిగువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరమా? పేద ప్రజలు.. సిఫారసు లేఖల కోసం పరిగెడుతున్నారు. చివరకు ఇదంతా అవినీతిదిశగా సాగుతోంది. అందువల్ల అవినీతిని ప్రోత్సహించే ఇంటర్య్యూల అంశంపై 15 రోజుల్లోనే స్పందించాం. 

త్వరలోనే ఇంటర్వ్యూలను తొలగించేలా చర్యలు చేపట్టాం. ’’ అని వివరించారు. ఇదిలా ఉండగా.. సూఫీ సందేశమే ఇస్లాం మతంలోని అసలు రూపాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఆల్‌ ఇండియా రేడియో డిజిటల్‌ విధానంలో రూపొందించిన ‘రామచరిత్‌మానస్‌’ను సోమవారం మోదీ ఆవిష్కరించనున్నారు