Friday, 6 November 2026

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు 

అమరావతి,మే15(జ‌నం సాక్షి ):   డీసెట్‌ పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు చేసినట్లు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఈ నెల 17, 18 తేదీల్లో జరగాల్సిన జనరల్‌, ఒకేషనల్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. 23, 24 తేదీల్లో ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే 30న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, 31న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇక 23 నుంచి 27 వరకు జరగాల్సిన ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు 25 నుంచి 29కి వాయిదా వేసినట్లు మంత్రి గంటా తెలిపారు. విద్యార్ధులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జరిగిన మార్పులను గమనించాలని మంత్రి అన్నారు.