హైదరాబాద్,నవంబర్23(జనంసాక్షి): ఖైరతాబాద్‌లో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి పాదయాత్ర చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఎన్ బిటీ నగర్ జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన వెంట పెద్దఎత్తున బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు స్వచ్చందంగా వచ్చి, హారతులు పడుతున్నారన్నారు. ప్రతి ఆడపడుచు అన్న మా ఓటు విూకే అని అంటుంటే, చాలా సంతోషంగా ఉందని చింతల తెలిపారు. బిజెపి మాత్రమే ప్రజలకు మేలు చేయగలదన్నారు. బిజెపి మాత్రమే నీతినిజాయితీ కలిగిన పార్టీ అన్నారు. గత నాలుగేళ్లలో అనేక సమస్యలను పరిష్కరించానని అన్నారు.




