ఇంటింటికీ తెలుగుదేశానికి అనూహ్య స్పందన: జివి

గుంటూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో అనూహ్య స్పందన లభిస్తుందని జిల్లా తెదేపా అధ్యక్షుడు జి.వి ఆంజనేయులు అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం చురుగ్గా సాగుతుందని తెలిపారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందుకే ప్రజలు బ్రహ్మరథం పడ్తున్నారన్నారు. మునిగిపోయే నావ లాంటి వైకాపాలో ఉండంటం ఇష్టం లేక ఆ పార్టీని వీడి తెదేపాలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారని తెలిపారు. విభజన సమయంలో ఎంపీగా ఉన్న జగన్‌ పార్లమెంట్‌లో

ప్రత్యేక¬దా గురించి ఎందుకు నోరువిప్పి మాట్లాడలేదని ప్రశ్నించారు. క్రమం తప్పకుండా ప్రజల వద్దకు వచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశమేనని ఎమ్మెల్యే అన్నారు. పలు అధికారిక, ఇంటింటికీ తెదేపా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్‌ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రజల్లో నిత్యం తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అయినా ఇంకా పలు సమస్యలు ఉన్నాయని, వాటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు. రైతుబజారు, డంపింగుయార్డు, మంచినీటి పథకం వంటివన్నీ చేపట్టామన్నారు. ప్రభుత్వం రైతులు సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

తాజావార్తలు