సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి
కాకినాడ,నవంబర్6(జనంసాక్షి): సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు సిఐటియు మద్దతు ప్రకటించింది. దేశంలోని కొన్ని రాష్టాల్లో సిపిఎస్ విధానం రద్దు చేశారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సిపిఎస్ విధానం రద్దుకు కృషి చేయాలని కోరుతూ పిఆర్‌టియు నాయకులు వినతిపత్రాన్ని అధికారులకు అందించారు