ఇంటింటికీ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ’ కార్యక్రమాన్ని నిర్వహించిన శిల్పాచారి..

 సికింద్రాబాద్ ( జనం సాక్షి ):    ఇంటింటికీ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ’ కార్యక్రమాన్ని  సికింద్రాబాద్ నియోజకవర్గము లోని అడ్డగుట్ట లో  నిర్వహించారు . తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు    పార్టీ అధినేత్రి షర్మిల   ప్రజాప్రస్థానం యాత్రను చేపట్టారు,  పార్టీని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని ఆమె కొరిక మేరకు  జిహెచ్ఎంసి  కోఆర్డినేటర్ వడక రాజగోపాల్  దేశాల మేరకు  ఈ కార్యక్రమం చేపడుతున్నాము   తెలిపారు.
ఈ సందర్భంగా శిల్పా చారి  మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి,
తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే వైయస్ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలి. ప్రస్తుతం టీఆరెస్ పాలనలో ఎనిమిదేళ్లుగా ఏ ఒక్క హామీని నెరవేర్చుక పొ గా బస్తీలలో నాలాల పునరేకీకరణ చేపడతామని ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చేయకపోవడం వర్షాకాలంలో పిల్లలు పెద్దలు  ప్రమాదాల బారినపడి నానా ఇబ్బందులు పడుతున్న కార్పొరేటర్ కానీ స్థానిక ఎమ్మెల్యే  గానీ ఎటువంటి పరిష్కారం చూయించలేదు అని కాలనీవాసులు బాధతో వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని  ప్రజల్లో తీసుకెళ్లే  విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శిల్పా చారి కోరారు.