Monday, 2 November 2026

ఇకపై కొలీజియం సమావేశాలకు హాజరుకాను: జస్టిస్ చలమేశ్వర్

0j4b77dfన్యూఢిల్లీ: ఇకపై తాను కొలీజియం సమావేశాలకు హాజరుకానంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఏదైనా ఒక నియామకం ఉంటే దానిపై తన అభిప్రాయం తెలపాల్సిందిగా కోరుతూ లేఖ రాయాలని దానికి తానిచ్చే సమాధానం రికార్డుల్లో ఉంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కొలీజియం ద్వారా నియామకాల్లో పారదర్శకత లేకపోవడమే తన గైర్హాజరుకు కారణమని మూడు పేజీల లేఖలో వివరించారు. కొలీజియం సమావేశాల్లో చర్చించిన విషయాలు సైతం రికార్డు చేయడం లేదని అలాంటప్పుడు సమావేశాల్లో పాల్గొనడం వల్ల ప్రయోజనం లేదనిపిస్తోందని అందులో వివరించారు. కాగా జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం భేటీకి రాకపోవడంతో సీజే ఆ సమావేశాన్ని వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *