Friday, 6 November 2026

ఇఫ్తార్‌లో పాల్గొన్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే

ఆర్మూర్‌ ఆగస్టు 11 (జనంసాక్షి) : ఆర్మూర్‌ పట్టణంలోని సైదాబాద్‌లోని షాదిఖానలో టిడిపి ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో శనివారం సాయంత్రం ఆర్మూర్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మా పాల్గొన్నా రు. ఈ సందర్బంగా ఆమె మాట్లా డుతు ఇఫ్తార్‌ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అమె అన్నారు. రాష్ట్రంలోని రెండవ కమ్యు నిటీ హల్‌ను ఆర్మూర్‌కు కేటాయిం చడం జరిగిందని తెలుగు దేశం పార్టీ ముస్లిం సోదరులకు ఎటు వంటి కష్టాలు కలుగకుండ చుసు కుంటుందని ముస్లింసొదరుల సహ కారంతోటే ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు, తెలంగాణ ప్రక్రియను ప్రకటించినప్పుడల్లా కాంగ్రేస్‌ ప్రభుత్వం దోబుచులాడుతుందని, ఇది దురదృష్టకరమైనది, వచ్చె రంజాన్‌ పండగా తెలంగాణ రాష్ట్రంలోనే జరుపు కోవాలని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు, ఈ కార్యక్రమంలో డీఎస్పీ కొత్తపల్లి నరసింహ, మాజి ఎంపీపీ మోతెరామ గౌడ్‌,  మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ కృష్ణపండిత్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు జివి నర్సింహరెడ్డి, నూకల ప్రభాకర్‌, స్వామి, టీడీపీ కార్యాకర్తలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *