Friday, 6 November 2026

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కోరుట్ల ఎమ్మెల్యే

మెట్‌పల్లి, ఆగస్టు 11 (జనంసాక్షి) : పట్టణంలోని యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పోలీస్‌ ఠాణాలో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలం గాణ ప్రజలను మోసం చేశాడని, ఎస్సై కిరణ్‌కుమార్‌ రెడ్డికి యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రా సాధనలో భాగంగా అన్ని కులాల సంఘాల యువకులు, విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేసి అమరులైతే, తెలం గాణ కోసం పోరాడుతున్న ప్రజలు జైల్‌లో జీవనం గడుపుతుంటే, వీటన్నింటిని అడ్డం పెట్టుకొని చివ రకు ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారిగా డబ్బులకు అమ్ముడుపోయి తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలిపారు. ఈ లంచగొండి వ్యవహరం నాయకుడిపై తగిన చర్యలు తీసుకుని, విచారణ జరిపి, డబ్బులు రికవరీ చేసి తెలంగాణ కోసం అమరులైన కుటుం బాలకు ఆడబ్బులు ఇప్పించాలని యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు బత్తుల నరేష్‌, తుమ్మనపెల్లి రాంప్రసాద్‌, పుల్లూరి రమేష్‌, మర్రినంద కిషోర్‌, కంబ శంకర్‌, ఆగ సురేష్‌, చిట్ల కార్తీక్‌, మ్యాకల వినోద్‌, మేడిచెల్మేల ప్రవీణ్‌, కారం కిషోర్‌, బోల్మల నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *