Tuesday, 3 November 2026

ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి

271892-kcr-700పెద్దనోట్ల రద్దు, అనంతరం తలెత్తిన పరిణామాలపై సిఎం కెసిఆర్‌ మంగళవారం సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వివరించారు. కొద్దిరోజులుగా అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈప్రభావం మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను ఆయన కోరారు. అదే విధంగా… తమిళనాడు సిఎం జయలలిత మృతిపట్ల తెలంగాణ సిఎం కెసిఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.. జయలలిత ఆత్మకుశాంతి చేకూరాలని ప్రార్థించారు.. అమ్మగా పురచ్చితలైవిగా అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కీరించబడిన జయమరణం తమిళసమాజానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. జయ రాజకీయ ప్రస్థానం సాహసోపితమైనదిగా ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *