ఇరాన్‌లో హెలికాఫ్టర్‌ కూలి 10మంది మృతి

 

టెహ్రాన్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి ): ఒక కారు ప్రమాదంలో గాయపడిన వారందరినీ త్వరగా ఆసుపత్రికి చేర్చే ప్రయత్నం నిష్ఫలమైంది. క్షతగాత్రులను తీసుకు వెళుతున్న హెలికాఫ్టర్‌ కుప్పకూ లడంతో అందులో ఉన్న 10మంది కన్నుమూశారు. ఇరాన్‌ ఉత్తర ప్రాంతంలో కారు ప్రమాదంలో గాయపడిన వారిని తీసుకుని ఈ విమానం మషాద్‌ అనే నగరానికి వెళ్తోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ కరెంట్‌ వైర్లకు తగలడంతో కుప్పకూ లింది. అందులో ఉన్న 10మంది అక్కడికక్కడే మరణించారు.