ఇరుకు సంతలో మైకుల మోత పట్టించుకోని అధికారులు

దండేపల్లి జనం సాక్షి నవంబర్ 5 దండేపల్లి మండలంలోని మేదరి పేటలో ప్రతి శనివారం జరిగే సంతలో పండ్ల వ్యాపారులు మైకులతో మో తలు మోగిస్తున్నారు ప్రతివారం మార్కెట్ కు కూరగాయలు తీసుకువెళ్లడానికి మహిళలు. అధిక సంఖ్యలో వస్తున్నారు అదేవిధంగా మెదరిపేట్ నుండి ద్వారక రోడ్డు వైపు ఓ ప్రైవేట్ పాఠశాల. కాలేజీ ఉన్నందున విద్యార్థులు కూడా వెళ్తుంటారు రోడ్డుపై మార్కెట్ ఉండడంతో మైకుల మోత వల్ల వాహనదారులు వాహనదారులు తమ వాహనాల హారాన్లు కొట్టిన వినపడకుండా మైకులను మోగిస్తున్నారు మైకుల సౌండ్ కు వినపడక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు కోరుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న పండ్ల వ్యాపారుల మైకులను తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని కూరగాయల మార్కెట్ విక్రయదారులు మహిళలు కోరుతున్నారు