పోలీసు పరీక్షలకు సన్నగ్ధం అవుతున్న అభ్యర్థులకు అండగా వడ్త్య దేవేందర్ నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ ప్రాంతం నుండి పోలీసు దేహ దారుఢ్య పరీక్షలకు సన్నగ్ధం అవుతున్న అభ్యర్థులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ సహృదయంతో స్పందించి వారికి కావాల్సిన అవసరాలను సమకూర్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పరిధిలో మైదానాన్ని శుభ్రపరిచి వారి ఇబ్బందులను రూపుమాపారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ చాలా రోజులుగా నెలకొన్న ఈ సమస్యను అధికారులకు, రాజకీయ ప్రముఖులకు ఎన్ని దరఖాస్తులు పెట్టుకున్న ఫలితం శూన్యంగా మిగిలిందని చివరి అవకాశంగా దేవేందర్ నాయక్ గారికి విన్నవించగా శర వేగంగా స్పందింది అభ్యర్థులకు కావాల్సిన అవసరాలను సమకూర్చారు. అందుకు దేవేందర్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలపట్ల నిత్యం స్పందించే ఇలాంటి నాయకులు మరిన్ని ఉన్నత పదవులలో ఉండి ప్రజల నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు, ఆర్థిక సహాయాలు చేస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చి విన్నవించినా వెంటనే స్పందించి వారికి తగు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఉన్నత చదువులు చదివి, రాజకీయంగా ఎదుగుతూ దేవరకొండ నియోజకవర్గం లో ప్రజలందరి మన్ననలు, ఆశీర్వాదాలు పొందుతున్నారు ఇలాంటి యువనేత రాజకీయాల్లో రాణించి ప్రజలకు సేవ చేయాలని పలువురు కొనియాడారు దేవరకొండ నియోజకవర్గం లో ఉన్నత చదువులు చదివిన యువకులకు ఉద్యోగ పరంగా వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ఉద్యోగ అవకాశాలు ప్రోత్సహిస్తూ వారికి కావలసిన సూచనలు సలహాలు అందిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు పేద ప్రజల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు