నిరుపేద విద్యార్థినికి అండగా విప్ & ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు.

✍🏻 MBBS విద్యార్థిని చదువుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం.

✍🏻 మరోమారు తన గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు.

చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం, అన్నారం గ్రామానికి చెందిన కోట రవీనా నీట్ లో మంచి ర్యాంకు సాధించి మహబూబ్ నగర్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన రవీనా హాస్టల్ మరియు యూనివర్సిటీ ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో తానున్నానంటూ గొప్ప మనసుతో ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు పేద విద్యార్థినికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా కష్టపడి చదివి సీట్ సాధించిన విద్యార్థినిని ఎమ్మెల్యే గారు అభినందించారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమ కుటుంబానికి పెద్దకొడుకుగా అడిగిన వెంటనే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని మరియు తల్లిదండ్రులు. కష్టకాలంలో తమకి అండగా నిలిచిన ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి రుణపడి ఉంటామని తెలిపిన విద్యార్థిని రవీనా. ఎమ్మెల్యే గారి మాటలు తమలో ఎంతో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపాయని ఈ సందర్భంగా తెలిపారు. కష్టపడి చదివి సుమన్ అన్న తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తామన్నారు.

 

ఒక పేద విద్యార్థిని ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక సహాయం అందించి వారిలో ఉన్న సేవాగుణాన్ని మరోసారి తెలిపిన చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ గారిపై చెన్నూరు నియోజకవర్గ ప్రజలు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు లక్షల రూపాయలతో బాల్క ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.