
దిల్లీ, జనవరి22(జనంసాక్షి): మణిపూర్ ఐరన్‌లేడీ ఇరోమ్ షర్మిలపై ఆత్మహత్య కేసు నమోదు చేయాలంఠూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరింఛింది. ఇరోమ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ దాఖలైన కేసును కోర్టు తోసిపుచ్చింది. 2000ల సంవత్సరంలో జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో సామాన్య పౌరులు మృతి చెంధటానికి నిరసనగా ఇరోమ్ షర్మిల అప్పటినుంఢి నిరాహారదీక్ష చేస్తున్నారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించాలంటూ 15 ఏళ్లుగా ఇరోమ్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్ష 2000 సంవత్సరం నుంచి కొనసాగిస్తున్నారు. దీనిపై ఆమె ఆహారం తీసుకోకుండా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందంటూ దాఖలైన కేసును ఇంఫాల్ కోర్టు ఈ రోజు తిరస్కరించింది. ఇరోమ్‌కు గత లోక్ సభ ఎన్నికల్లో తమపార్టీ తరఫున పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలనుండి ఆహ్వానం వచ్చినా దాన్ని ఆమె తిరస్కరించారు. తాను పోరాడటానికి మాత్రమే నిర్ణయించుకున్నానని తేల్చి చెప్పారు. పౌర హక్కులకు సంబంధించి ఆమె పోరాటానికి పలు అవార్డులు లభింఛాయి.
ఇరోం షర్మిలపై ఆత్మహత్య కేసును తిరస్కరించిన కోర్టు




