Monday, 2 November 2026

ఇరోమ్‌ షర్మిళ మళ్లీ దీక్ష

5

– సాయుధ దళాల ప్రత్యేక చట్టం రద్దుచేసే వరకు పోరు ఆగదు

ఇంఫాల్‌,మార్చి1(జనంసాక్షి):వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ షర్మిల గత 15ఏళ్లుగా పోరాడుతున్నారు. పలు సందర్భాల్లో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఆస్పత్రిలో ఉంచి ముక్కు ద్వారా ద్రవాహారం అందజేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం కేసు నుంచి సోమవారం విడుదలైన షర్మిల  తన మద్దతుదారులతో కలిసి వెళ్లి ప్రఖ్యాత షాహిద్‌ మినార్‌ వద్ద తిరిగి దీక్షను ప్రారంభించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన షర్మిల అధిక సంఖ్యలో మద్దతుదారులతో కలిసి షాహిద్‌ మినార్‌ వద్ద తిరిగి దీక్ష ప్రారంభించారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆమె 2002 నుంచి దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *