Monday, 2 November 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్

4స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ తో పాటూ బడ్జెట్ ప్రభావం కూడా మార్కెట్లపై కనిపిస్తోంది. దాంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో 24వేల 86 దగ్గర ట్రేడవుతోంది. అటు నిఫ్టీ కూడా లాభాల్లోనే కొనసాగుతోంది. నిఫ్టీ ప్రస్తుతం 90 పాయింట్ల లాభంతో 7వేల 317 దగ్గర ట్రేడవుతోంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్ సీ, యాక్సిస్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *