Wednesday, 4 November 2026

ఈజిప్ట్ కైరో ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ: 25 మంది మృతి

సోమవారం, 9 ఫిబ్రవరి 2015

  cricket stadium

ఈజిప్ట్ కైరో ఫుట్బాల్ స్టేడియంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈజిప్ట్‌ దేశంలో ఉన్న కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్‌బాల్ స్టేడియంలో విషాద సంఘటన జరిగింది. అభిమానులు, భద్రతా దళాలకు మధ్య ఏర్పడిన ఘర్షణలో సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 35 మంది గాయపడ్డారు. అక్కడి మీడియా కథనాల ప్రకారం… లీగ్ క్లబ్ జమేలక్, ఈఎన్పీపీఐ మధ్య మ్యాచ్ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

 కొందరు టికెట్లు లేకుండా స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. అభిమానులను అడ్డుకోలేని స్థితిలో పోలీసులు కాల్పులు జరిపారు. 
అనంతరం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో వైపు పోలీసుల కాల్పులను నిరసిస్తూ అభిమానులు విధ్వంసం సృష్టించారు. పలువాహనాలకు నిప్పులు పెట్టారు. స్టేడియంలో కుర్చీలను, బారికేడ్రను ధ్వంసం చేశారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *