Thursday, 5 November 2026

ఈనెల 25న తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌, మే 14న ఎంట్రన్స్‌ టెస్ట్‌

హైదరాబాద్‌ : విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంసెట్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 25న . ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలవుతంది. ఈనెల 28 నుంచి ఏప్రిల్‌ 9 వరకూ ఎంసెట్‌ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. రూ. 500 ఫైన్‌తో ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ, రూ. 1000 ఫైన్‌తో ఏప్రిల్‌ 22 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. విద్యార్ధులు మే 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ హాల్‌టికెట్లు పొందవచ్చు. మే 14వ తేదీన ఎంసెట్‌ పరీక్ష జరుగుతుంది. ఎంసెట్‌ ప్రిలిమినరీ కీను మే 16న విడుదల చేస్తారు. మే 23వ తేదీ వరకూ అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉంటుంది. మే 28న ర్యాంకులు ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *