Monday, 2 November 2026

ఈనెల15న ఉట్నూర్ లోజరిగే బండిసంజయ్ సభను విజయవంతం చేయాలి.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
భారత దేశ ప్రదాని మోడీ పరిపాలన వ్యవస్థ అభివృద్ధి పథకాల అమలు దేశానికె వెన్నంటిదని ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు అన్నారు.శనివారం రోజున ఎంపీ,జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్  పర్యాటనలో పాల్గొన్న
గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్
మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన చేసినటువంటి  అభివృద్ధి పథకాలను గడప గడపకు తెలియజేసే విధంగా పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు జిల్లా అధ్యక్షులు  పాయల్ శంకర్ ప్రచారంలో పాల్గొన్నారు.గుడిహత్నూర్ ఇచ్చోడ బజార్హత్నూర్ బోథ్ నేరడిగొండ మండలాలలో పర్యటించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నేల15 తేదిన ఊట్నూర్ లో జరిగే బండి సంజయ్ సభని విజయవంతం చేయాలని ఎంపీ సోయం బాపురావ్ కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.