పల్లె ప్రగతి లో భాగస్వాములు కావాలి.
నార్నూర్ జనంసాక్షి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ కనక మో తు బాయి అన్నారు శనివారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని బొప్పా పూర్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రవేశ పెడుతుంది అన్నారు పల్లె ప్రగతి తో గ్రామాలు పచ్చదనం పరిశుభ్రతతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు విద్యుత్ శాఖ ఏ ఈ ఖదీర్ నాయకులు కనక ప్రభాకర్ మధుకర్ ఉన్నారు.