నిరుద్యోగ యువతీ యువకులకు సహాయం చేయడంలో టాపర్ ఇన్స్టిట్యూషన్ వెంకట్ రెడ్డి సార్ సేవలు మరువలేనివి మంగళ పెళ్లి హుస్సేన్

తొర్రూరు 11 జూన్ (జనం సాక్షి ) మండలంలోని  స్థానిక జడ్పీ హెచ్ఎస్ హైస్కూల్ కేంద్రంలో ఈరోజు శనివారము ఉదయము హైదరాబాద్ టాపర్ ఇన్స్టిట్యూషన్ వెంకట్ రెడ్డి సార్ సహాయ సహకారాలతో. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్. సోషల్ సర్వీస్ . ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మంగళపల్లి హుస్సేన్ .ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగము .కరెంట్ అఫైర్స్ .చరిత్ర .మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చేయడం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేయడంలో వెంకట్ రెడ్డి సేవలు మరువలేనివని మంగళపల్లి హుస్సేన్ అన్నారు. ఎస్సై కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు కష్టపడి ఇష్టపడి విలువైన సమయాన్ని ఉపయోగించుకుని లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాకూబ్. అశోక్ .పూర్ణ .అమీర్ .మహేష్. రామకృష్ణ .సదానందం గౌడ్. బాలకృష్ణ .రాజు. రాజశేఖర్. సహజ. పరుశరాములు.విద్యార్థులు పాల్గొన్నారు.