హైదరాబాద్ : తెలంగాణాలో ఇవాళ జరగనున్న టీఎస్ ఈసెట్ -2016 పరీక్షకు సెట్ కోడ్ వై2ను ఎంపిక చేశారు. కూకట్ పల్లిలోని జె.ఎన్.టి.యు లో తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ సెట్ కోడ్ ను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 7 ముఖ్య పట్టణాలలో 8 రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. పరీక్షకు 26,994 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వారందరి కోసం 54 పరీక్ష కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు. పరీక్ష విధులను ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించనున్నారని చెప్పారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించబోమని తెలిపారు.
ఈసెట్ -2016..సెట్ కోడ్ వై2 ఎంపిక..




